ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని రామ్ నగర్లో ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముస్లింలకు తోఫా కిట్లు అందించారు. రంజాన్ ఉపావాస దీక్షలు ఆచరిస్తున్న ముస్లింలకు లాక్డౌన్ సమంయలో సాయం చేయడం భారతీయులుగా మన బాధ్యత అన్నారు. రామ్‌నగర్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సుధాకర్ గుప్తా నివాసం వద్ద ముస్లింలకు తోఫా కిట్లు పంచారు. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన ఆరోగ్య విధానాలు, ఆహార పద్ధతులు అందరూ పాటించాలని సూచించారు. ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటేనే.. వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుందని.. వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే ఆర్థికంగా బలపడతామని ఆయన వ్యాఖ్యానించారు.
ముస్లింలకు తోఫా కిట్లు పంచిన ఎమ్మెల్యే ముఠా గోపాల్ - సరుకులు పంచిన ఎమ్మెల్యే
సమాజంలోని పౌరులందరినీ కులమతాలకు అతీతంగా గౌరవ భావంతో చూడాలని, ప్రతీవారితో ప్రేమగా మెలగాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. నియోజకవర్గంలోని రామ్‌నగర్‌లో ముస్లింలకు ఆయన రంజాన్ సందర్భంగా తోఫా కిట్లు అందించారు.
ముస్లింలకు తోఫా కిట్లు పంచిన ఎమ్మెల్యే ముఠా గోపాల్