కరోనా మహమ్మారి నుంచి అందరిని రక్షించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ముఠాగోపాల్ (muta Gopal) స్పష్టం చేశారు. హైదరాబాద్లోని ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో.. జీహెచ్ఎంసీ పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన సూపర్ స్ప్రెడర్స్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు.
Muta Gopal: కరోనా నుంచి రక్షించడమే ప్రభుత్వ లక్ష్యం - తెలంగాణ వార్తలు
వ్యాపార వాణిజ్య సంస్థల్లో పనిచేసే కిందిస్థాయి సిబ్బంది వ్యాక్సినేషన్ వేసుకోవాలని ఎమ్మెల్యే ముఠాగోపాల్ సూచించారు. ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన సూపర్ స్ప్రెడర్స్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు.

వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే ముఠాగోపాల్
వ్యాపార వాణిజ్య సంస్థల్లో పనిచేసే కిందిస్థాయి సిబ్బంది ఎవరూ కూడా నిర్లక్ష్యం వహించకుండా వ్యాక్సినేషన్ వేసుకోవాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించాలని ఆయన పేర్కొన్నారు. కరోనా మహమ్మారి రెండో దశ పట్ల ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు.
ఈ వ్యాక్సిన్ కేంద్రాన్ని వ్యాపార వాణిజ్య కేంద్రాల్లో పనిచేసే కార్మికుల సౌకర్యార్థం ఏర్పాటు చేశారు. ప్రతి రోజూ విడతలవారీగా వ్యాక్సిన్ వేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.