ముషీరాబాద్ నియోజకవర్గంలోని భోలక్‌పూర్ డివిజన్ బేర్ బీర్ గల్లీ ప్రాంతంలో నెలకొన్న మంచినీటి సమస్యపై అధికారులతో కలిసి ఎమ్మెల్యే ముఠా గోపాల్ చర్చించారు. ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ సమయంలో ఆయా ప్రాంతాల్లో మంచినీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్ - ముషీరాబాద్ నియోజకవర్గం
ముషీరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముషీరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. వేసవిలో ప్రజలకు మంచినీటి సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో.. అటు ప్రజలకు.. ఇటు అధికారులకు పలు సూచనలు చేశారు.
నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్
మంచినీటి సరఫరా విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలు మాస్కులు ధరించి బయటకు రావాలని, వ్యక్తిగత పరిశుభ్రత, భౌతిక దూరం పాటిస్తే.. కరోనా మన దగ్గరికి రాదని ప్రజలకు అవగాహన కల్పించారు.
ఇవీ చూడండి; సమగ్ర వ్యవసాయ విధానంపై మంత్రి సమీక్ష