బస్తీ దవాఖానాల్లో రోగులకు సిబ్బంది అందుబాటులో ఉండాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. నిరుపేదలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి అందరూ సహకారం అందించాలని తెలిపారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం భోలక్ పూర్లోని దామోదర సంజీవయ్య నగర్లో నూతనంగా నిర్మించిన బస్తీ దవాఖానను శాసనసభ్యులు ముఠా గోపాల్ సందర్శించారు.
బస్తీ దవాఖానాను సందర్శించిన ఎమ్మెల్యే - government hospital
ముషీరాబాద్ నియోజకవర్గం దామోదర సంజీవయ్యనగర్‌లో నూతనంగా నిర్మించిన బస్తీ దవాఖానాను శాసనసభ్యులు ముఠా గోపాల్ సందర్శించారు. ప్రజలు ఆస్పత్రి సేవలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. వైద్యులు రోగులకు అందుబాటులో ఉండాలని ఆయన పేర్కొన్నారు.
mla visit government hospital
ఆస్పత్రిలో రోగులకు అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయా అని ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు ఆస్పత్రి సిబ్బంది బీపీ, షుగర్ పరీక్షలు చేశారు. ప్రజలందరూ బస్తీ దవాఖానా సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. రోగుల పట్ల సిబ్బంది సత్ప్రవర్తన కలిగి ఉండాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ పేర్కొన్నారు.
ఇవీ చూడండి: 'కరోనా లక్షణాలపై ఐసీఎంఆర్ అధ్యయనం'