తెలంగాణ

telangana

ETV Bharat / state

పూలకుండీల్లో చెత్తను తొలగించిన ఎమ్మెల్యే - ఎమ్మెల్యే ముఠాగోపాల్​

పురపాలక శాఖ మంత్రి ఆదేశాలమేరకు ముషీరాబాద్​లో ఎమ్మెల్యే ముఠాగోపాల్​ తన నివాసంలోని పూలకుండీల్లోని చెత్తను తొలగించారు. అనంతరం ఇంటి పరిసరాల్లోని వ్యర్థాలను శుభ్రం చేశారు.

MLA Muta gopal suggestion to take mosquito prevention measures in Hyderabad
దోమలపై సమైక్యంగా పోరాడుదాం: ఎమ్మెల్యే

By

Published : May 10, 2020, 3:28 PM IST

ప్రతి ఆదివారం పది గంటలకు పదినిమిషాల పాటు ఇళ్లలోనే ఉండి దోమల నివారణ కార్యక్రమాలు చేపట్టాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రజలకు తెలిపారు. మంత్రి ఆదేశాల మేరకు ముషీరాబాద్​ ఎమ్మెల్యే ముఠాగోపాల్​ తన నివాసంలోని పూలకుండీల్లోని చెత్తను తొలగించారు.

దోమల వ్యాప్తిని అరికట్టడం, మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు ఆయన అవగాహన కల్పించారు. ప్రజలందరూ కలిసి సమైక్యంగా దోమలపై పోరాటం చేయాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details