ప్రజలు మంచి నీటిని పొదుపుగా వాడి భావితరాలకు మార్గదర్శకంగా ఉండాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. నియోజకవర్గంలో మంచి నీటి సరఫరా కొరత సమస్యలపై జలమండలి అధికారులు ఎప్పటికప్పుడు దృష్టి సారించాలన్నారు. అడిక్మెట్ డివిజన్ వడ్డెర బస్తీలో శాశ్వతంగా మంచినీటి కొరత తీర్చే పనులను ఆయన ప్రారంభించారు.
'వానాకాలంలో తాగునీరు కలుషితం కాకుండా చూడాలి' - ము
ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. నియోజకవర్గంలో మంచి నీటి ఎద్దడి రాకుండా పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు.
musheerabad mla latest news
వర్షాకాలంలో తాగునీరు కలుషితం కాకుండా అధికారులు, సిబ్బంది మంచి నీటి పైప్లైన్లను పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ హేమలత జయరాం రెడ్డితోపాటు పలువురు నేతలు కలిశారు.