తెలంగాణ

telangana

ETV Bharat / state

'కరోనా బాధిత కుటుంబాలకు చేయూతనివ్వండి' - కరోనా బాధిత కుటుంబాలకు సరకులు పంపిణీ చేసిన ముఠా గోపాల్​

కొవిడ్​-19 బాధిత కుటుంబాలకు సహాయం చేయాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. గాంధీనగర్​లో ఎస్​ఆర్​డీ స్వచ్ఛంద సేవా ఆధ్వర్యంలో కరోనా పాజిటివ్ వచ్చిన కుటుంబాలకు ఆయన నిత్యవసరాలు పంపిణీ చేశారు.

mla muta gopal said donors should help Corona affected families
'కరోనా బాధిత కుటుంబాలకు దాతలు సహాయం చేయాలి'

By

Published : Jun 11, 2020, 8:47 PM IST

కరోనా బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ కోరారు. గాంధీనగర్​లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎస్​ఆర్​డీ స్వచ్ఛంద సేవా ఆధ్వర్యంలో కరోనా పాజిటివ్ వచ్చిన కుటుంబాలకు నిత్యవసరాలు పంపిణీ చేశారు. జీహెచ్ఎంసీ 15వ సర్కిల్ ఉప కమిషనర్ ఉమా ప్రకాష్, ఆ సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి పలువురికి సరకులు అందజేశారు.

ఉపాధి లేని కుటుంబాలతోపాటు కరోనా పాజిటివ్​ వచ్చిన కుటుంబాలకు సహాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని ఎమ్మెల్యే సూచించారు. స్వచ్ఛంద సంస్థలు మానవతా దృక్పథంతో అభాగ్యులను, నిరాశ్రయులను చేరదీయడం అభినందనీయమని అభినందించారు.

ఇదీ చూడండి :ఎమ్మెల్యే శ్రీధర్​బాబు అరెస్టు.. ఫుట్​పాత్​పై బైఠాయించి నిరసన

ABOUT THE AUTHOR

...view details