తెలంగాణ

telangana

ETV Bharat / state

'గణతంత్ర ఫలాలు భావి తరాలకు అందించండి' - ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముషీరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నియోజకవర్గంలోని పలు డివిజన్లలో పర్యటిస్తూ.. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

mla muta gopal participated in republic day celebrations in musheerabad
'గణతంత్ర ఫలాలు భావి తరాలకు అందించండి'

By

Published : Jan 26, 2021, 2:36 PM IST

గణతంత్ర ఫలాలు భావి తరాలకు అందించడానికి యువత నడుం బిగించాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ కోరారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్​, ముషీరాబాద్ నియోజకవర్గంలోని క్యాంపు కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.

అనంతరం ఎమ్మెల్యే.. నియోజకవర్గంలోని గాంధీనగర్, కవాడిగూడ, రాంనగర్, అడిక్మెట్, భోలక్పూర్ డివిజన్లలో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో తెరాస యువ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఇదీ చదవండి:'గణతంత్రం'పై కోహ్లీ స్ఫూర్తిదాయక ట్వీట్

ABOUT THE AUTHOR

...view details