హరితహారంలో భాగంగా ప్రతిఒక్కరూ మొక్కలు నాటి రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. హైదరాబాద్ ముషీరాబాద్‌లోని రాజా డీలక్స్ సమీపంలో తెరాస నేత శ్రీను ఆధ్వర్యంలో స్థానికులకు మొక్కలు పంపిణీ చేశారు. పెరుగుతున్న కాలుష్య నివారణకు మొక్కలు నాటటమే పరిష్కారమని ఎమ్మెల్యే తెలిపారు.
ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి, సంరక్షించాలి: ముఠా గోపాల్ - mla plantation
హైదరాబాద్ ముషీరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠాగోపాల్ పాల్గొన్నారు. స్థానికులకు మొక్కలు పంపిణీ చేశారు. కరోనా విజృంభిస్తున్న వేళ ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.
mla muta gopal participated in haritha haaram
స్వచ్ఛమైన గాలి కోసం ఆక్సీజన్ కొనుక్కునే పరిస్థితి రాకుండా ప్రతిఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని పెంచడం లక్ష్యంగా ముందుకు సాగాలని ఎమ్మెల్యే సూచించారు. సమాజంలో రోజురోజుకూ విస్తరిస్తున్న కరోనాను అరికట్టడానికి అందరూ నిబంధనలు పాటించాలని కోరారు.