వంట చేస్తున్న సమయంలో.. మహిళలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పేర్కొన్నారు. గాంధీనగర్లోని క్యాంపు కార్యాలయంలో.. రాష్ట్ర విపత్తు, అగ్నిమాపక సేవల శాఖతో ఆయన సమావేశమయ్యారు. వంట గదిలో మహిళలు తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలపై రూపొందించిన గోడ పత్రికను ఆవిష్కరించారు.
'మహిళలు వంట గదిలో అప్రమత్తంగా ఉండాలి' - రాష్ట్ర విపత్తు, అగ్నిమాపక సేవల శాఖ
రాష్ట్ర విపత్తు, అగ్నిమాపక సేవల శాఖతో.. ఎమ్మెల్యే ముఠా గోపాల్ సమావేశమయ్యారు. అగ్ని ప్రమాదాల పట్ల మహిళలు తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలపై.. శాఖ రూపొందించిన గోడ పత్రికను ఆవిష్కరించారు.
వంట గది జాగ్రత్తలు
గ్యాస్ స్టవ్, సిలిండర్, రెగ్యులేటర్లతో ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే.. సొంతంగా ఎలాంటి చర్యలకు ఉపక్రమించవద్దని ఎమ్మెల్యే తెలిపారు. వెంటనే గ్యాస్ డీలర్ని సంప్రదించాలన్నారు. ప్రతి రోజు పడుకునే ముందు రెగ్యులేటర్ను ఆఫ్ చేయాలని సూచించారు.
ఇదీ చదవండి:ప్రైవేటు టీచర్లను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం మాదే: కేటీఆర్