ముషీరాబాద్ డివిజన్లో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే ముఠా గోపాల్, భాజపా కార్పొరేటర్ సుప్రియ గౌడ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. బాపూజీ నగర్లో రూ. కోటి 82 లక్షల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో తెరాస, భాజపా కార్యకర్తల నినాదాలతో అక్కడ కాసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
ప్రారంభోత్సవంలో తెరాస, భాజపా నినాదాలు - ముషీరాబాద్ ఎమ్మెల్యే
ముషీరాబాద్‌లో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ముఠా గోపాల్, భాజపా కార్పొరేటర్ సుప్రియ గౌడ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. కార్యక్రమం జరిగే సమయంలో.. తెరాస, భాజపా కార్యకర్తల నినాదాలతో అక్కడ కాసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
ఎమ్మెల్యే ముఠా గోపాల్
తెరాస శ్రేణులు.. ఎమ్మెల్యే ముఠా గోపాల్ జిందాబాద్ అంటూ, భాజపా శ్రేణులు సుప్రియా గౌడ్ జిందాబాద్ అంటూ నానా హంగమా చేశారు. వెంటనే ఎమ్మెల్యే జోక్యం చేసుకొని అభివృద్ధి పనుల్లో రాజకీయాలను పక్కన పెట్టాలని సూచించారు. కార్యకర్తలంతా రాజకీయాలకు అతీతంగా ముందుకు సాగాలని కోరారు.
ఇదీ చదవండి:'రాబోయేకాలంలో ఆయిల్‌పామ్ తోటలకు అనుకూలంగా మెదక్ జిల్లా'