బాల కార్మిక రహిత సమాజ నిర్మాణానికి మార్గం సుగమం చేయాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని హైదరాబాద్ జవహర్ నగర్లోని టీఆర్టీ కమిటీ హాల్లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన గోడ పత్రికను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.
'బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి' - Anti child labour day in hyderabad
బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని హైదరాబాద్ జవహర్ నగర్లోని టీఆర్టీ కమిటీ హాల్లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన గోడ పత్రికను ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆవిష్కరించారు. బాల కార్మిక వ్యవస్థను సంపూర్ణంగా నిర్మూలించడానికి ప్రతి పౌరుడు బాధ్యతగా పాటుపడాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. కొవిడ్ -19 వల్ల పిల్లలు బాల కార్మికులుగా మారటం గతం కన్నా అధికమవుతోందని విచారం వ్యక్తం చేశారు.
!['బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి' Mla muta gopal inugrated anti child labour wall poster in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-04:24-tg-hyd-29-12-msrd-chaild-labour-poster-release-av-ts10017-12062020162007-1206f-1591959007-1100.jpg)
Mla muta gopal inugrated anti child labour wall poster in hyderabad
బాల కార్మిక వ్యవస్థను సంపూర్ణంగా నిర్మూలించడానికి ప్రతి పౌరుడు బాధ్యతగా పాటుపడాలని ఎమ్మెల్యే కోరారు. పిల్లలపై పని భారం వద్దని... బాల్యం పిల్లల హక్కు అని ఉద్ఘాటించారు. కొవిడ్ -19 వల్ల పిల్లలు బాల కార్మికులుగా మారటం గతం కన్నా అధికమవుతోందని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే ప్రశంసించారు.