తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంచిన ముషీరాబాద్​ ఎమ్మెల్యే - పాఠ్య పుస్తకాల పంపిణీ

ముషీరాబాద్​ నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు స్థానిక శాసనసభ్యులు ముఠా గోపాల్​ ఉచిత పాఠ్య పుస్తకాలు అందజేశారు. ప్రతి ఒక్కరిని విద్యావంతులుగా తీర్చి దిద్దితే.. సమాజం ఉన్నత స్థాయిలో ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు.

MLA Muta gopal Distributes Lesson Books for Govt School students
విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంచిన ముషీరాబాద్​ ఎమ్మెల్యే

By

Published : Jul 25, 2020, 7:27 PM IST

హైదరాబాద్​లోని ముషీరాబాద్​ నియోజకవర్గంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్​ ఉచిత పాఠ్య పుస్తకాలు అందజేశారు. విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చి దిద్దేందుకు ప్రతీ ఒక్కరు తమవంతు కృషి చేయాలన్నారు. అడిక్​మెట్​ డివిజన్​లోని నల్లకుంట, జమిస్తాన్​పూర్​ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు డిప్యూటీ డీఈవో సామ్యూల్ రాజు, కార్పోరేటర్​ హేమలత జయరాంతో కలిసి ఆయన ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు.

అన్ని వర్గాల ప్రజలను ఉన్నత విద్యావంతులుగా తీర్చి దిద్దడానికి ప్రభుత్వం నిర్మాణాత్మక ప్రణాళికతో ముందుకు సాగుతున్నదని తెలిపారు. అన్ని సదుపాయాలు కల్పించి ప్రభుత్వం అందిస్తున్న విద్యను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు హితవు పలికారు. వ్యక్తిగత నైపుణ్యాలు, ప్రతిభ పెంచుకునేందుకు విద్యార్థులు నిరంతరం కృషి చేయాలని సూచించారు.

ఇవీ చూడండి:రాష్ట్రంలో అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా..

ABOUT THE AUTHOR

...view details