హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే ముఠా గోపాల్, కార్పొరేటర్ హేమలత జయరామిరెడ్డిలు చెత్త రిక్షాలను పంపిణీ చేశారు. కరోనా సమయంలోనూ ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించడం ప్రశంసనీయమన్నారు.
పారిశుద్ధ్య కార్మికులకు చెత్త రిక్షాలు పంపిణీ - పారిశుద్ధ్య కార్మికులకు చెత్త రిక్షాలు పంపిణీ
పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవలను ప్రతీ ఒక్కరూ గుర్తించాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో కార్మికులకు చెత్త రిక్షాలను పంపిణీ చేశారు.
పారిశుద్ధ్య కార్మికులకు చెత్త రిక్షాలు పంపిణీ
పారిశుద్ధ్య సిబ్బంది పట్ల ఎవరు అసభ్యంగా వ్యవహరించవద్దని ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హేమలత జయరాం రెడ్డి, యువ నాయకులు ముఠా జై సింహ, స్థానిక డివిజన్ ప్రెసిడెంట్ శ్యాంసుందర్, కార్యదర్శి సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:కరోనా వేళ కూలీల ఆశాదీపం 'ఉపాధిహామీ'