తెలంగాణ

telangana

ETV Bharat / state

ముస్లింలకు దుస్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - రంజాన్​ వేడుకలు

ముషీరాబాద్ నియోజకవర్గం అడికిమెట్​​లో రంజాన్​ను పురస్కరించుకుని.. ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముస్లిం సోదరులకు దుస్తులు పంపిణీ చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగను జరుపుకోవాలని సూచించారు.

Ramadan cloths distribution
Ramadan cloths distribution

By

Published : Apr 29, 2021, 7:46 PM IST

ముస్లిం సోదరులు కరోనా నియమాలను పాటిస్తూ రంజాన్​ వేడుకలను జరుపుకోవాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ విజ్ఞప్తి చేశారు. పండుగను పురస్కరించుకుని.. ముషీరాబాద్ నియోజకవర్గం అడికి​మెట్​లోని ఓ మసీదు వద్ద.. ప్రభుత్వం తరఫున పేదలకు దుస్తులు పంపిణీ చేశారు.

ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న మహమ్మారి పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:ప్రాణాలు పణంగా పెట్టి ఎన్నికలా: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details