హైదరాబాద్‌ని ముషీరాబాద్, హిమాయత్ నగర్ తహసీల్దార్ కార్యాలయ పరిధిలో ఉన్న లబ్ధిదారులకు ఎమ్మెల్యే ముఠా గోపాల్ కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. సీఎం కేసీఆర్ ఏ రాష్ట్రంలో లేనివిధంగా సంక్షేమ పథకాలు చేపట్టారని తెలిపారు. కరోనా మహమ్మారి బారిన పడకుండా ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, భౌతిక దూరం పాటిస్తూ... మాస్కులు ధరించాలని సూచించారు.
'కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలు పేదలకు వరం'
లబ్ధిదారులకు షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మీ చెక్కులను ఎమ్మెల్యే ముఠా గోపాల్ పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ పేద ప్రజల సంక్షేమం కోమే ఈ పథకాలు తీసుకొచ్చినట్లు తెలిపారు.
కల్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతోపాటు కార్పొరేటర్లు ముఠా పద్మ నరేష్, వి.శ్రీనివాస్ రెడ్డి, హేమలత రెడ్డి, ముషీరాబాద్ ఎమ్మార్వో జానకి, హిమాయత్ నగర్ ఎమ్మార్వో లలిత హాజరయ్యారు.
ఇవీ చూడండి:అకాల వర్షాలతో రైతన్న కష్టం నేలపాలు!