మహమ్మారి వేళ పేదలను ఆదుకోవడానికి తెరాస ప్రభుత్వం ఎల్లవేళలా ముందు ఉంటుందని ఎమ్మెల్యే ముఠాగోపాల్ (muta gopal) అన్నారు. హైదరాబాద్ చిక్కడపల్లిలో తెరాస నేత కందురి కృష్ణ ఆధ్వర్యంలో నిరు పేదలకు, పారిశుద్ధ్య కార్మికులకు అల్పాహారం, పండ్లు శానిటైజర్స్, మాస్కులను ముఠా గోపాల్‌తో కలిసి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా పంపిణీ చేశారు.
'పేదలను ఆదుకోవడానికి ప్రభుత్వం ఎల్లవేళలా ముందుంటుంది' - తెలంగాణ వార్తలు
కరోనా వేళ ఏ ఒక్కరూ కూడా ఆకలితో ఉండొద్దననే.. సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం చేస్తున్నట్లు ఎమ్మెల్యే ముఠాగోపాల్ తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత రేషన్ బియ్యం ఈ రోజు నుంచి ఒక్కొక్కరికి 15 కిలోలు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. పేదలను ఆదుకోవడానికి తెరాస ప్రభుత్వం ఎల్లవేళలా ముందు ఉంటుందని స్పష్టం చేశారు.
ప్రతి రోజు నియోజకవర్గంలో 5 వేల మందికి అన్నదానం చేస్తున్నట్లు ముఠా గోపాల్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ఏ ఒక్కరూ కూడా ఆకలితో ఇబ్బంది పడకుండా ఉండాలని సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత రేషన్ బియ్యం ఈ రోజు నుంచి ఒక్కొక్కరికి 15 కిలోలు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కోలేటి దామోదర గుప్త జన్మదినం సందర్భంగా ఆయనను ముఠా గోపాల్, కందూరి కృష్ణ తదితరులు సన్మానించారు.
ఇదీ చూడండి: అన్‌లాక్‌పై రాష్ట్రాల దృష్టి- అక్కడ ఐదంచెల వ్యూహం!