హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని అడిక్మెట్, రాంనగర్ డివిజన్లలోని పేద ప్రజలకు, తెల్ల రేషన్ కార్డులేని వారికి ఎమ్మెల్యే ముఠా గోపాల్ బెస్త 5 కిలోల బియ్యం సహా కిరణా సరుకులు పంపిణీ చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో నియోజకవర్గంలోని పలు డివిజన్లలో పేదల ఆకలి తీర్చేందుకే సరుకులు పంపిణీ చేశామని ఆయన తెలిపారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో తెరాస కార్మిక విభాగం అధ్యక్షుడు రాంబాబు, కార్పొరేటర్ హేమలత, తెరాస నగర నేత ఎడ్ల హరిబాబు యాదవ్ వలస కార్మికులు పాల్గొన్నారు.
రేషన్కార్డులేని వారికి సరుకులు పంచిన ముషీరాబాద్ ఎమ్మెల్యే - ఎమ్మెల్యే ముఠా గోపాల్ బెస్త
హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలో తెల్ల రేషన్ కార్డులేని పేదలకు నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే ముఠా గోపాల్ బెస్త అందజేశారు.
ముషీరాబాద్ పరిధిలో సరుకులు పంచిన ముఠా గోపాల్ బెస్త