ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు లాక్డౌన్ కారణంగా హైదరాబాద్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న 2000 మంది నిరుపేదలకు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు నిత్యావసర సరుకులను అందజేశారు. మొత్తం 5 వేల క్వింటాళ్ల బియ్యం, పప్పు, నూనెలను పంపిణీ చేశారు.
నిరుపేదలకు నిత్యావసర సరుకుల అందజేత - నిరుపేదలకు నిత్యావసర సరుకుల అందజేత
లాక్డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న హైదరాబాద్లోని నిరుపేదలకు, పేద బ్రాహ్మణులకు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అలాగే మాస్కులు, శానిటైజర్ కిట్లను కూడా అందజేశారు.
నిరుపేదలకు నిత్యావసర సరుకుల అందజేత
కరోనా మహమ్మారి దేశాన్ని వదిలి వెళ్లిపోయే వరకూ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. మాస్కులు, సానిటైజర్ కిట్లను కూడా అందజేశారు. నియోజకవర్గంలోని ప్రతీ కాలనీలో హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించామని ఎమ్మెల్యే వివరించారు.
ఇవీ చూడండి:కరోనా వేళ కూలీల ఆశాదీపం 'ఉపాధిహామీ'