కరోనా కట్టడికి ప్రజలు ప్రభుత్వ నియమ నిబంధనలను తప్పక పాటించాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పేర్కొన్నారు. మాస్కు ధరించడం, భౌతిక దూరం విధిగా పాటించాలన్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్నగర్ డివిజన్లో కార్పొరేటర్ సి.నారాయణరెడ్డి ఏర్పాటు చేసిన మొబైల్ శానిటేషన్ వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలి: మాగంటి గోపీనాథ్ - jubileehills MLA Maganti Gopinath latest news
కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు తప్పక మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సూచించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్నగర్ డివిజన్లో ఏర్పాటు చేసిన మొబైల్ శానిటేషన్ వాహనాన్ని ఆయన ప్రారంభించారు.
మాస్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
నియోజకవర్గంలో కరోనాను నియంత్రించేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో వైరస్ను కట్టడి చేసేందుకు కార్పొరేటర్ల కృషి ఎంతో అభినందనీయమన్నారు. ప్రజలు సైతం ప్రభుత్వ నియమ నిబంధనలు పాటిస్తూ.. వైరస్ అంతానికి సహకరించాలని కోరారు. కొవిడ్ వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. అనంతరం పలువురికి మాస్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సి.నారాయణరెడ్డి, తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు.