తెలంగాణ

telangana

ETV Bharat / state

ముస్లిం సోదరులకు నిత్యావసరాల పంపిణీ - mla madhavaram krishnarao distributed daily needs to poor muslims

హైదరాబాద్ కూకట్ పల్లి నియోజకవర్గంలో ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నిత్యావసరాలను పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రజా ప్రతినిధులు ముందుకు రావాలని ఆయన కోరారు.

mla madhavaram krishnarao distributed daily needs to poor muslims at kukatpally
ముస్లిం సోదరులకు నిత్యావసరాల పంపిణీ

By

Published : Apr 10, 2020, 3:57 PM IST

హైదరాబాద్ కూకట్‌పల్లిలో ముస్లింలకు స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆపన్న హస్తం అందించారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో దాదాపు పదివేల మందికి బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.

లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలెవరూ బయటకు రావద్దని ఎమ్మెల్యే సూచించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఎవరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో తన వంతు సాయమందిస్తున్నట్లు కృష్ణారావు తెలిపారు.

ఇదీ చదవండి:మంచినీళ్లు అనుకుని శానిటైజర్ తాగేసిన డీహెంచ్​వో

ABOUT THE AUTHOR

...view details