తెలంగాణ

telangana

ETV Bharat / state

'వాణీ దేవి గెలుపు కేసీఆర్​కు కానుకగా ఇవ్వాలి' - Hyderabad latest news

హైదరాబాద్ ఓల్డ్ బోయిన్​పల్లి డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ సన్నాహక సభలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొన్నారు. తెరాస అభ్యర్థిని సురభి వాణీ దేవిని గెలిపించాని కోరారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దృష్టిలో ఉంచుకొని ఓటు వేయాలని సూచించారు.

MLA Madhavaram Krishna Rao participated in the Trs MLC election campaign
తెరాస ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

By

Published : Mar 7, 2021, 6:38 PM IST

తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు దృష్టిలో ఉంచుకొని సురభి వాణీ దేవికి ఓటు వేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విజ్ఞప్తి చేశారు. ఆమెను గెలిపించాల్సిన బాధ్యత ప్రజలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులపై ఉందని పేర్కొన్నారు.

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్​నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సికింద్రాబాద్​ ఓల్డ్ బోయిన్​పల్లి డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల సన్నాహక సభలో కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్​తో కలిసి పాల్గొన్నారు. గతంలో గెలిచిన ఎమ్మెల్సీలు చేసిందేమీ లేదని విమర్శించారు.

ప్రస్తుతం తెరాస అభ్యర్థిని గెలిపించుకుని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్​ను అన్ని రంగాల్లో ముందంజలో నిలిపిన కేసీఆర్​కు ఈ విజయం కానుకగా ఇవ్వాలని కోరారు.

ఇదీ చూడండి:చట్టసభల్లో గొంతెత్తే అవకాశం ఇవ్వండి: రాములు నాయక్

ABOUT THE AUTHOR

...view details