''ఓవైపు పీవీ నరసింహారావు ఘన కీర్తిని పొగిడి, సోనియాను దేవత అన్న కేసీఆర్కు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు. ఓ సందర్భంలో కేటీఆర్ కాంగ్రెస్ను బొంద పెడతా అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులను మాట్లాడనివ్వటం లేదు.
తెలంగాణ ప్రజలు కేసీఆర్ లాంటి నియంతను సీఎంగా కోరుకోవట్లేదు. అనేక మంది యువకుల త్యాగాల ఫలితంగా తెలంగాణ వచ్చింది. కనీసం రిప్రజెంటేషన్ ఇవ్వటానికి కూడా కేసీఆర్ సమయం ఇవ్వట్లేదు. బయట సీఎం అపాయింట్ మెంట్ ఇవ్వట్లేదు.. అసెంబ్లీలో మాట్లాడనివ్వటంలేదు. అలాంటి అసెంబ్లీ ఇంకెందుకు. కేసీఆర్ ఫామ్ హౌస్లో అసెంబ్లీ పెట్టుకోవాలి.''
- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
అసెంబ్లీలో మా గొంతు నొక్కుతున్నారు. మాట్లాడుతున్నపుడు రెండు నిమిషాలకే బెల్ కొడుతున్నారు. ఇదేక్కడి ప్రజాస్వామ్యం. రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన చర్చలను జరగనివ్వటం లేదు. 2004లో పీవీ చనిపోయినప్పుడు తెరాస నేతలు కనీసం అంత్యక్రియలకు కూడా హాజరుకాలేదు. తెలంగాణ గడ్డపై పుట్టిన పీవీకి భారతరత్న ఇవ్వటంపై మిత్రపక్షం ఎంఐఎం బహిష్కరించడంపై కేసీఆర్ సమాధానం చెప్పాలి.