తెలంగాణ

telangana

ETV Bharat / state

ముందస్తు అరెస్టులను ఖండిస్తున్నాం: జీవన్ రెడ్డి - ప్రభుత్వంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం

ఉపాధ్యాయ, ఉద్యోగుల ముందస్తు అరెస్టులను ఖండిస్తున్నట్లు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తెలిపారు. ఛలో అసెంబ్లీ కోసం ఉపాధ్యాయులు సెలవు అడిగినా ఇవ్వట్లేరని మండిపడ్డారు.

jeevan reddy latest news
ముందస్తు అరెస్టులను ఖండిస్తున్నాం: జీవన్ రెడ్డి

By

Published : Mar 13, 2020, 4:03 PM IST

సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయులు తలపెట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు చేస్తున్న ముందస్తు అరెస్టులను ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఖండించారు. ఉపాధ్యాయులు సెలవు అడిగినా ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఆర్సీపై 2018లో సీఎం కేసీఆర్ స్వయంగా హామీ ఇచ్చినా... నేటికీ కార్యరూపం దాల్చకపోవడం బాధాకరమని తెలిపారు.

దిల్లీ ప్రభుత్వ విద్య-వైద్య విధానం ప్రజల మెప్పు పొందుతోందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించాలని, పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. మండల స్థాయి విద్యా విధానం నిర్వీర్యం అవుతోందని మండిపడ్డారు.

ముందస్తు అరెస్టులను ఖండిస్తున్నాం: జీవన్ రెడ్డి

ఇవీ చూడండి:పన్నులు, విద్యుత్‌ ఛార్జీలు పెంచుతాం: కేసీఆర్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details