టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ ఛైర్మన్ జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికారంలోకి రాలేమని గ్రహించే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి భాష మార్చుకోవాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి పరుష పదజాలం వాడటంపై.. రాహుల్, సోనియాగాంధీకి లేఖ రాసి.. ట్వీట్ చేశామని జీవన్ రెడ్డి వెల్లడించారు.
మీరు తిడ్తే.. మేం తిడ్తం. ఎందుకయ్యా బురదల రాయేసి మూతి మీద చిల్లిచ్చుకుంటరు. మంచిగ మాట్లాడు. మూడు చింతలపల్లి పోయినవ్. అక్కడ ఏమని చెప్తవ్ ఇయ్యాల. 24 గంటల కరెంట్ ఇస్తున్నరు అది వద్దని చెప్తవా..? ప్రతీ ఇంటికి 2 వేల రూపాయల పింఛన్ ఇస్తున్నరు అది కూడా వద్దని చెప్తవా? సీఎం కేసీఆర్ మేనమాన లాగా కల్యాణ లక్ష్మీ కింద డబ్బులు ఇస్తున్నరు.. అది నిజం కాదని చెప్తవా? రైతుబంధు, రైతుబీమా కూడా ఇస్తలేమని చెప్తవా? ఇవన్నీ వాస్తవం కావంటవా..?