టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Tpcc President Revanth Reddy)హోల్‌సేల్ బ్లాక్ మెయిల్ బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (Mla Jeevan Reddy) ఆరోపించారు. మల్లారెడ్డి, మై హోం, మేఘా, నవయువ సంస్థలతో పాటు చివరికి పోలీసులను సైతం బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఓ ఐరన్‌లెగ్ అని పేర్కొన్న జీవన్ రెడ్డి... తెలంగాణలో తెదేపాకి పట్టిన గతే కాంగ్రెస్‌కు పట్టబోతోందని తెలిపారు. టెండర్లు వేసిన వారిపై ఆర్టీఐ వేసి సీబీఐకి ఇవ్వడం బ్లాక్ మెయిల్ కాదా అని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ఎల్పీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన జీవన్... రేవంత్ రెడ్డితో పాటు బండి సంజయ్‌పై విమర్శలు గుప్పించారు. రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌లకు సవాల్ చేస్తున్నానని ఏ వేదికపైన అయినా చర్చకు సిద్ధమని ప్రకటించారు. హైదరాబాద్ సింగరేణి కాలనీ ఘటన దుదృష్టకరమని.. బాధాకరమని తెలిపారు. ప్రభుత్వం హంతకుడిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తుందన్నారు.