రాష్ట్రంలో ఐటీ, పారిశ్రామిక రంగాల పురోగతిపై శాసనసభలోమంత్రి కేటీఆర్(minister ktr speech) రెండు గంటలపాటు అనర్గళంగా ఇచ్చిన స్పీచ్‌కు భాజపా(bjp), కాంగ్రెస్(congress) ఉలిక్కిపడుతున్నాయని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి(Mla jeevan reddy comments) అన్నారు. కేటీఆర్ ప్రసంగం అనంతరం ప్రతిపక్షాలు ఆగమవుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ లేఖలు రాయాల్సింది సీఎం కేసీఆర్‌కు(bandi sanjay letter to cm kcr) కాదని... ప్రధాని మోదీకి(pm modi) రాయాలని సూచించారు. ఫసల్ బీమాను భాజపాపాలిత రాష్ట్రాలు కూడా తిరస్కరించాయని జీవన్ రెడ్డి తెలిపారు. బండి సంజయ్‌తోపాటు భాజపా ఎమ్మెల్యేలు, ఎంపీలు దిల్లీకి పాదయాత్రచేయాలని ఎద్దేవా చేశారు. శ్రీకాంతాచారి మరణానికి రేవంత్‌రెడ్డి కారణం కాదా అని ప్రశ్నించిన జీవన్‌రెడ్డి... హుజూరాబాద్ ఉపఎన్నికకు(huzurabad by elections congress candidate) కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థే లేరని చురకలంటించారు.
రఘునందన్ పరిశ్రమల గురించి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఎంపీ కూడా అబద్ధాలే మాట్లాడుతున్నారు. బండి సంజయ్ గారు లేఖలు రాస్తూ అబద్ధాలు మాట్లాడుతున్నారు. భాజపా అంటే జలగల పార్టీ. అత్యధిక ట్యాక్సులు, జీఎస్టీలు, పెట్రోల్ బాదుడుతో ప్రతిఒక్కరి రక్తం తాగుతున్నటువంటి పార్టీ. అది జలగల పార్టీ. జలస్ పార్టీ కూడా. మంత్రి కేటీఆర్ రెండు గంటలు కూలంకషంగా మాట్లాడితే జలస్ ఫీల్ అవుతున్నారు. ప్రాంతీయ పార్టీలో ఇంతగొప్పగా తేలిండు... దేశానికే ప్రధాని అవుతాడని జలస్ ఫీల్ అవుతున్న పార్టీ.