భారతీయ జనతాపార్టీలో క్రమశిక్షణ లోపించిందని ప్రజారంగ సంస్థల శాసనసభ కమిటీ ఛైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ప్రభుత్వ విప్ భానుప్రసాద్ ఆరోపించారు. భాజపాలో గాడ్సే వారసులే ఉన్నారని జీవన్‌రెడ్డి దుయ్యబట్టారు. తాము తలుచుకుంటే కాషాయం నేతలు ఎక్కడా తిరగలేరన్నారు. అవినీతికి మారుపేరైన భాజపా.. తెరాసపై మాట్లాడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.
కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకురాని కిషన్‌రెడ్డి.. రూ. 10 వేల సాయం చేసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని విరుచుకుపడ్డారు. భాజపా ఇంఛార్జి తరుణ్‌చుగ్ ఇంట గెలిచి రచ్చ గెలవాలని.. సొంత రాష్ట్రంలో రైతులు రోడ్లపై ఉన్నారని జీవన్‌రెడ్డి దుయ్యబట్టారు.