తెలంగాణ

telangana

ETV Bharat / state

MLA Jeevan reddy on BJP and congress :'కేసీఆర్ అంటే స్కీమ్​ల​ పార్టీ... భాజపా అంటే స్కామ్​ల పార్టీ' - తెలంగాణ వార్తలు

MLA Jeevan reddy on BJP and congress : కాంగ్రెస్‌, భాజపాపై ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఆ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆరోపణలు చేశారు. ఇటీవల అన్ని ఎన్నికల్లోనూ ఆ విషయం నిరూపితమైందని అన్నారు.

MLA Jeevan reddy on BJP and congress, trs mla jeevan press meet
ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రెస్​మీట్

By

Published : Dec 28, 2021, 12:31 PM IST

Updated : Dec 28, 2021, 1:37 PM IST

MLA Jeevan reddy on BJP and congress : రాష్ట్రంలో కాంగ్రెస్‌, భాజపా కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆరోపించారు. కోటి 51 లక్షల ఎకరాలకు రైతుబంధు సాయం పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. రెండు పార్టీల పాలిత రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు తెలంగాణలో పాలనను చూసేందుకు రావాలని జీవన్‌రెడ్డి హితవు పలికారు.

కాంగ్రెస్‌, భాజపా రెండో స్థానం కోసం మాత్రమే పోటీ పడుతున్నాయని .. రాష్ట్రంలో తెరాసకు తిరుగులేదన్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన రేవంత్‌రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం తగదని జీవన్‌రెడ్డి మండిప‌డ్డారు.

'దుబ్బాకలో భాజపా గెలిచింది. కాంగ్రెస్​కు డిపాజిట్ తగ్గలేదు. అక్కడ కుమ్మక్కయ్యారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్​కు ఒక్క సీటు రాలేదు. భాజపాకు 48 సీట్లు వచ్చాయి. అక్కడా కుమ్మక్కయ్యారు. నాగార్జునసాగర్​లో కాంగ్రెస్​కు కొన్ని ఓట్లు వచ్చాయి. భాజపాకు డిపాజిట్ రాలేదు. అక్కడ కూడా కుమ్మక్కయ్యారు. హుజూరాబాద్​లో గతంలో 65 వేల ఓట్లు ఉన్న కాంగ్రెస్​కు... ఈ పీసీసీ వచ్చాక 3వేల ఓట్లు వచ్చాయి. అక్కడ కూడా కుమ్మక్కయ్యారు. నిజామాబాద్​ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రెండు సార్లు గెలిచిన మధుయాష్కికి డిపాజిట్ దక్కలేదు. అక్కడ కూడా భాజపాతో కాంగ్రెస్ కుమ్మక్కయింది. రెండు పార్టీల ఆఫీసులు నాంపల్లిలో ఉన్నాయి. నాంపల్లి బ్రదర్స్​గా మారారు. కేసీఆర్ అంటే స్కీమ్​ల​ పార్టీ... భాజపా అంటే స్కామ్​ల పార్టీ. కేసీఆర్ అంటే నమ్మకం... భాజపా అంటే అమ్మకం పార్టీ.' -జీవన్‌రెడ్డి, ఆర్మూర్‌ ఎమ్మెల్యే

ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రెస్​మీట్

ఇదీ చదవండి:ప్రసాదమూర్తి, ఎం.నాగేశ్వరరావులకు అరుణ్‌సాగర్‌ విశిష్ట పురస్కారాలు

Last Updated : Dec 28, 2021, 1:37 PM IST

ABOUT THE AUTHOR

...view details