తెలంగాణ

telangana

ETV Bharat / state

వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలి - జగ్గారెడ్డి - కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్

రైతులకు ఆర్థికంగా నష్టం చేకూర్చే... కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.

mla jaggareddy responds on farmers issue
వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలి - జగ్గారెడ్డి

By

Published : May 26, 2021, 7:42 PM IST

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని మోదీ తీసుకొచ్చిన చట్టాలతో రైతులు ఆర్ధికంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టాలు అమలైతే రైతు పండించిన పంట నేరుగా అమ్ముకునే పరిస్థితి ఉండదన్నారు.

నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేసేట్లుకేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ ఒత్తిడి చేయాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు. సంగారెడ్డి, తెలంగాణ రాష్ట్ర రైతుల పక్షాన ఉంటూ… రైతు సంఘాలు ఇచ్చిన పిలుపునకుసంపూర్ణ మద్దతు తెలుపుతున్నానని పేర్కొన్నారు.

ఇదీ చదవండి :'గాంధీలో మృత్యుంజయులు 44,335 మంది'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details