పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి హైదరాబాద్ మాదాపూర్‌లో సైకిల్ తొక్కుతూ... నిరసన వ్యక్తం చేశారు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ధరలు తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు.
పెట్రో ధరలపై సైకిలెక్కి జగ్గారెడ్డి వినూత్న నిరసన
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మాదాపూర్‌లోని తన నివాసం నుంచి సైకిల్ తొక్కుతూ... ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
సైకిలెక్కి నిరసన వ్యక్తం చేసిన జగ్గారెడ్డి
కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సామాన్యుడిపై భారం పడుతూనే ఉందన్నారు. ఇప్పటికే కరోనా వల్ల ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని... ఇలాంటి విపత్కర సమయంలో వారిపై భారం మోపడం సరికాదని తెలిపారు.
ఇదీ చూడండి:హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్