హరీశ్ రావు రాజకీయ జీవితం దుబ్బాక ఉపఎన్నికతో ముడిపడి ఉందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణం బాధాకరమన్న ఆయన సిద్దిపేట కలెక్టర్.. సీఎంకు అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలు జరగకుండానే, ఫలితాలు రాకముందే తెరాస గెలిచినట్లు ప్రకటన చేస్తున్నారని ధ్వజమెత్తారు.
దుబ్బాకలో ఓడిపోతే మంత్రి పదవి ఉండదు: జగ్గారెడ్డి
దుబ్బాక ఉపఎన్నికల్లో తెరాస ఓడిపోతే హరీశ్‌రావుకు మంత్రి పదవి ఉండదని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. దుబ్బాక ఉపఎన్నిక.. హరీశ్‌రావు రాజకీయ జీవితంతో ముడిపడి ఉందన్నారు జగ్గారెడ్డి.
ఓడిపోతే మంత్రి పదవి ఉండదు: జగ్గారెడ్డి
దుబ్బాక ప్రజలు ఓటు వేసేముందు ఒకసారి ఆలోచన చేయాలన్నారు. దుబ్బాకలో కాంగ్రెస్ గెలిస్తే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.
ఇవీ చూడండి:హైదరాబాద్‌లోని చెరువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి : కేసీఆర్