సీఎం కేసీఆర్‌ను కలిసి విద్యార్థుల సమస్యలు చెప్పే అవకాశం లేనందునే ప్రగతిభవన్ ముట్టడికి యత్నించారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. తక్షణమే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించాలన్నారు. విద్యార్థులపై ఎలాంటి కేసులు లేకుండా చూడడంతోపాటు విద్యార్థుల సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.
'విద్యార్థుల గురించి ప్రభుత్వం, అధికారులు పట్టించుకోరు'
ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు బలమూరి వెంకట్‌రావు అరెస్టును ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఖండించారు. విద్యార్థుల పక్షాన పోరాడుతున్న వెంకట్‌పై ఎలాంటి కేసులు పెట్టకుండా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ప్రవేశ పరీక్షలు వాయిదా వేయాలన్నారు.
'విద్యార్థుల గురించి ప్రభుత్వం, అధికారులు పట్టించుకోరు'
వెంకట్ డిమాండ్ చేస్తున్నట్లుగా డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించకుండానే నేరుగా ప్రమోట్ చేయాలని ఆయన సూచించారు. కరోనా వ్యాప్తి తగ్గేవరకు ప్రవేశ పరీక్షలు వాయిదా వేయాలని కోరారు. ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు వెంకట్ పోరాటానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చూడండి :ప్రముఖ గాయని పేరిట చాటింగ్ చేస్తూ... రూ.1.75 కోట్లు స్వాహా