మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ పరిధిలో కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మొక్కలు నాటారు. కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్... ఆయురారోగ్యాలతో ఉండాలని నిండు నూరేళ్ళు జీవించాలని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో మూడు వేల మొక్కలు నాటడం శుభ పరిణామమని ఎమ్మెల్యే అన్నారు.
కేటీఆర్ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే మాధవరం - minister ktr birthday latest updates
మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ పరిధిలో కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మొక్కలు నాటారు.
కేటీఆర్ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే మాధవరం
మొక్కలను నాటి వాటిని సంరక్షిస్తే భవిష్యత్తులో... మనకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన అన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ స్వీయనియంత్రణ వ్యక్తిగత శుభ్రత పాటించాలని మాధవరం కోరారు. వర్షాకాలం ప్రభావం వల్ల కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.