హైదరాబాద్ ముషీరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పద్మశాలి కాలనీలోని కమ్యూనిటీ హాల్ స్థలంలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని ఎమ్మెల్యే ముఠాగోపాల్, జీహెచ్ఎంసీ సర్కిల్ 15 ఉపకమిషనర్ ఉమాప్రకాశ్, జీహెచ్ఎంసీ సిబ్బంది కలిసి శుభ్రపరిచారు. నియోజకవర్గాన్ని స్వస్థతలో మార్గదర్శకంగా తీర్చిదిద్దడానికి అందరూ సమష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
పారిశుద్ధ్య సిబ్బందితో చెత్తాచెదారాన్ని శుభ్రం చేసిన ఎమ్మెల్యే - mla gopal cleaning areas in musheerabad
హైదరాబాద్ ముషీరాబాద్‌లోని ఎమ్మెల్యే ముఠా గోపాల్, జీహెచ్ఎంసీ సర్కిల్ 15 ఉపకమిషనర్ ఉమాప్రకాశ్, జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య సిబ్బంది కలిసి పలు ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను శుభ్రపరిచారు. తమ పరిసరాలను శుభ్రపరచుకోవటం వల్ల సీజనల్ వ్యాధులు రావని ఎమ్మెల్యే తెలిపారు.
![పారిశుద్ధ్య సిబ్బందితో చెత్తాచెదారాన్ని శుభ్రం చేసిన ఎమ్మెల్యే dust clearance at musheerbad constituency](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7500301-517-7500301-1591429234938.jpg)
పారిశుద్ధ్య సిబ్బందితో చెత్తాచెదారాన్ని శుభ్రం చేసిన ఎమ్మెల్యే
ప్రజల్లో అంటువ్యాధుల పట్ల అవగాహన పెంపొందించేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని గోపాల్ తెలిపారు. వానాకాలంలో సీజనల్ వ్యాధుల బారినపడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తమ ఇంటిని, చుట్టుపక్కల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వ్యక్తిగత శుభ్రతను పాటించాలని విజ్ఞప్తి చేశారు.