తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రజల అభీష్టానికి దూరంగా వెళ్తోందని అభిప్రాయపడ్డారు. ఆ పార్టీలో ఏళ్ల తరబడి ఉన్నవాళ్లకు న్యాయం జరగట్లేదని చెప్పారు. రేవంత్ రెడ్డి డబ్బులిచ్చి కీలక పదవులు పొందారని ఆరోపించారు. పీసీసీ అధ్యక్ష పదవి రాకుంటే రేవంత్ కూడా పార్టీ మారేవారని అన్నారు.
రేవంత్ రెడ్డి 2017లో తెదేపాకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు కాని స్పీకర్‌కు రాజీనామా పత్రం ఎందుకు ఇవ్వలేదు. బ్లాక్మెయిల్ రాజకీయాలకు రేవంత్ రెడ్డి కేరాఫ్ అడ్రస్. రేవంత్ ఇంట్లో రెవెన్యూ టీం పెట్టుకున్నారు.
-సుధీర్ రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే
అనేక వివాదాల మధ్య రేవంత్‌రెడ్డికి పీసీసీ పదవి దక్కిందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. కొనుక్కున్న పదవులు చూసి రేవంత్‌రెడ్డి మిడిసిపడుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమే వివాదమైందని చెప్పారు. రాళ్లతో కొట్టాలని ఒక ఎంపీ చెప్పడం దారుణమన్నారు. రేవంత్ రెడ్డి.. నిషేధిత మావోయిస్టుల భాష మాట్లాడుతున్నారని చెప్పారు. పార్టీ ఫిరాయింపుల చట్టానికి లోబడి తాము పార్టీ మారినట్లు తెలిపారు.
రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడే కాదు ఒక పార్లమెంట్ సభ్యుడు. రాజస్థాన్‌లో బీఎస్పీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకుంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలంటే స్పీకర్ ఇవ్వాలి కాని రేవంత్ రెడ్డి చంద్రబాబుకు ఇచ్చారు.
- గండ్ర వెంకటరమణారెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే
ఇదీ చదవండి:Revanth Reddy: కేసీఆర్‌కు ప్రజలు ఎక్కువే ఇచ్చారు