తెరాస ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు.. చౌకబారు విమర్శలు చేస్తున్నాయని మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మండిపడ్డారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ డివిజన్ జ్ఞాని జైల్ సింగ్ నగర్లో రూ. 50 లక్షల ఖర్చుతో నిర్మించిన సీసీ రోడ్‌ను జూబ్లీహిల్స్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణతో కలిసి ప్రారంభించారు.
తెరాస ప్రభుత్వానికి సోషల్ వర్కర్స్ ఉన్నారు: దానం నాగేందర్ - ఎమ్మెల్యే దానం నాగేందర్ తాజా వార్తలు
ప్రతిపక్షాలు సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అసత్య ప్రచారాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హెచ్చరించారు. ప్రతిపక్షాలకు సోషల్ మీడియా ఉంటే తెరాస ప్రభుత్వానికి సోషల్ వర్కర్స్ ఉన్నారన్నారు. ప్రభుత్వ అభివృద్ధి పనులు చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు చౌకబారు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు.
దేశవ్యాప్తంగా కొవిడ్‌తో అన్ని రాష్ట్రాలు సతమతమవుతున్నా.. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధిలో ముందుంది అని దానం నాగేందర్ తెలిపారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అనేక లింకు రోడ్లను నిర్మించారని.. దీంతో ఈ ఏడాది భారీ వర్షాలు కురిసిన ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదన్నారు. ప్రతిపక్షాలు సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అసత్య ప్రచారాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని దానం హెచ్చరించారు. ప్రతిపక్షాలకు సోషల్ మీడియా ఉంటే తెరాస ప్రభుత్వానికి సోషల్ వర్కర్స్ ఉన్నారన్నారు.
ఇవీ చూడండి: మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్