తెలంగాణ

telangana

ETV Bharat / state

Danam Nagender:కేసీఆర్ కుటుంబంపై వ్యక్తిగత ఆరోపణలు సరికాదు - హైదరాబాద్ వార్తలు

దళిత బంధు పథకం త్వరలో ఖైరతాబాద్ నియోజకవర్గంలో ప్రారంభమవుతుందని... మాజీ మంత్రి, ఎమ్మల్యే దానం నాగేందర్ తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఫైలెట్ ప్రాజెక్ట్ కింద మొదలైన ఈ పథకం కోసం జనగణన కూడా జరుగుతోందని... అది పూర్తయిన వెంటనే... అర్హులందరికీ ఇచ్చే ప్రయత్నం చేస్తామని ఎమ్మల్యే దానం నాగేందర్ తెలిపారు.

Mla_Danam_On_Dalitha_Bandhu_
త్వరలో దళిత బంధు

By

Published : Aug 30, 2021, 1:25 PM IST

Danam Nagender:

కేసీఆర్ కుటుంబంపై వ్యక్తిగత ఆరోపణలు సరికాదు

ఖైరతాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకం త్వరలో ప్రారంభమవుతుందని... ఎమ్మల్యే దానం నాగేందర్ తెలిపారు. హైదరాబాద్ ఆదర్శ్ నగర్​ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్​లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో..హిమాయత్ నగర్ డివిజన్​కు చెందిన 11 మంది లబ్దిదారులకు కల్యాణలక్ష్మి, 17 మందికి షాదీ ముబారక్ చెక్కులను స్థానిక భాజపా కార్పోరేటర్ మహాలక్ష్మితో కలిసి దానం నాగేందర్ పంపిణీ చేశారు.

కులమతాలకు అతీతంగా పేదలకు అండగా నిలవాలన్న ఉద్దేశంతో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ప్రవేశపెట్టారని ఆయన తెలిపారు. ప్రతిపక్ష నాయకులు ఏ విమర్శ చేసినా.. నిర్మాణాత్మకంగా ఉండాలి కాని రాజకీయ స్వలాభాల కోసమే ముఖ్యమంత్రిని, ఆయన కుటుంబ సభ్యులపై కొందరు విమర్శలు చేయడం సరికాదన్నారు.

ఇదీ చదవండి:'వాల్టా చట్టాన్ని పునఃసమీక్షించాలి.. 'పోడు' కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలి'

ABOUT THE AUTHOR

...view details