పేదలకు సంక్షేమ పథకాలను అందించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఇందిరానగర్లో 20 లక్షల రూపాయలతో నిర్మించిన రోడ్డు పనులను దానం నాగేందర్ ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలోనే కాక రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లోనూ పేద ప్రజలకు అభివృద్ధి పథకాలను అందించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కొనసాగుతున్నారని పేర్కొన్నారు.
అందరికీ సంక్షేమ పథకాలు..