ఫిలింనగర్, ఇందిరానగర్ బస్తీల్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బుధవారం పర్యటించారు. ఎల్ఆర్ఎస్పై స్థానికులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జూబ్లీహిల్స్ డివిజన్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, డివిజన్ అధ్యక్షుడు పెరుక కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్ఆర్ఎస్పై బస్తీల్లో అవగాహన కల్పించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ - తెలంగాణ ఎల్ఆర్ఎస్ వార్తలు
పేద, మధ్య తరగతి బస్తీవాసులు నిర్మించుకున్న నివాసాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేస్తోందని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. జూబ్లీహిల్స్ డివిజన్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, డివిజన్ అధ్యక్షుడు పెరుక కిరణ్ కుమార్తో కలిసి ఫిలింనగర్, ఇందిరానగర్ బస్తీల్లో పర్యటించి ఎల్ఆర్ఎస్పై అవగాహన కల్పించారు.
ఎల్ఆర్ఎస్పై బస్తీల్లో అవగాహన కల్పించిన ఎమ్మెల్యే దానం నాగేందర్
గతంలో 58,59 జీవోల కింద పట్టాలు పొందిన వారితో పాటు... నోటరీ ద్వారా కొనుగోలు చేసినవారు, ఆస్తి పన్ను చెల్లిస్తున్నవారు ఈ పథకానికి అర్హులవుతారని వివరించారు. స్థలాలపై పూర్తి స్థాయి యాజమాన్య హక్కు కల్పించడమే కాకుండా.. క్రయవిక్రయాలు చేసుకునేందుకు అవకాశం లభిస్తుందని తెలిపారు. బస్తీల్లో 75 గజాలలోపు స్థలం ఉన్నవారు ఇల్లు కట్టుకునేందుకు జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోనవసరం లేదన్నారు.
ఇదీ చూడండి:నాలాల సమస్యను పరిష్కరించాలని సర్కారు నిర్ణయం