హైదరాబాద్ ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాల్లో ఇంటింటికి తిరుగుతూ స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ నిత్యావసర సరుకులు, చీరలు, దుప్పట్లను పంపిణీ చేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే అన్నారు.
వరద బాధితులకు నిత్యావసరాల పంపిణీ - hyderabad news
ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే దానం నాగేందర్ పర్యటించారు. వరదలతో నష్టపోయిన వారికి నిత్యావసర సరకులు, చీరలు, దుప్పట్లను పంపిణీ చేశారు.
వరద బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దానం
సీఎం కేసీఆర్ బాధితులను ఆదుకునేందుకు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారన్నారు. వరదలతో నష్టపోయిన వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని దానం నాగేందర్ భరోసా ఇచ్చారు. ఇది ప్రకృతి వైపరీత్యమని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ప్రావీణ్య పాల్గొన్నారు.
ఇవీ చూడండి: మూసీ ఉగ్రరూపం.. ముసారాంబాగ్ వంతెనపై వరద ప్రవాహం