హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని దత్తానగర్‌లో ఎమ్మెల్యే దానం నాగేందర్ పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ వరద బాధితులకు రూ.10వేల ఆర్థిక సాయం, నిత్యావసరాలు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు.
'వరద బాధితులకు తెలంగాణ సర్కార్ అండగా నిలుస్తుంది' - danam nagender visited himayath nagar
భారీ వర్షాలతో ముంపునకు గురైన ప్రాంతాల్లో ఎమ్మెల్యే దానం నాగేందర్ విస్తృతంగా పర్యటించారు. హిమాయత్‌నగర్‌లోని దత్తానగర్‌లో ఇంటింటికి తిరుగుతూ.. వరద బాధితులకు రూ.10వేలు అందించారు.
వరద బాధితులకు రూ.10వేలు
హిమాయత్‌నగర్ వీధి నంబర్ 13లో నాలా పరివాహక ప్రాంతంలో రిటైనింగ్ వాల్ నిర్మిస్తామని.. దీని కోసం రూ.3 కోట్లు కేటాయించినట్లు దానం వెల్లడించారు.