నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ కారు ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలం అవేర్ గేట్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన జగన్ స్థానికంగా ఓ పాఠశాలలో భవన నిర్మాణ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. అతను అవేర్ రైల్వే గేటు వద్ద మూత్ర విసర్జన చేస్తుండగా... జైపాల్‌యాదవ్ కారు అతన్ని ఢీకొంది. తీవ్రంగా గాయపడిన జగన్ అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఆ సమయంలో ఎమ్మెల్యే జైపాల్ కూడా కారులో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన తర్వాత ఎమ్మెల్యే తన గన్‌మెన్‌తో కలిసి మరో కారులో వెళ్లిపోయినట్టు స్థానికులు తెలిపారు. ఆగ్రహించిన మృతుడి కుటుంబసభ్యులు తమకు న్యాయం చేయాలంటూ రహదారిపై బైఠాయించారు. తీవ్ర ట్రాఫిక్ జాం ఏర్పడటం వల్ల పోలీసులు వాహనాలను దారి మళ్లించారు.
ఎమ్మెల్యే కారు ఢీకొని వ్యక్తి మృతి - శ్రీకాకుంళం జిల్లా
రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలం అవేర్ గేట్ సమీపంలో కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కారు ఢీ కొని జగన్ అనే వ్యక్తి మృతి చెందాడు. తమకు న్యాయం చేయాలంటూ మృతుడి కుటుంబసభ్యులు రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు.
ఎమ్మెల్యే కారు ఢీకొని వ్యక్తి మృతి
Last Updated : Sep 16, 2019, 7:47 AM IST