తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎట్టెట్టా - ఇంజినీరింగ్‌ స్టూడెంట్స్‌తో క్యాంపెయిన్‌- రాజకీయ పార్టీల స్పెషల్ ప్యాకేజీలు అదుర్స్ - Parties focus on Telangana assembly elections

MLA Candidates Using Engineering Students for Election Campaign : రాష్ట్రంలో ఎన్నికల సందడి మొదలైంది. వివిధ పార్టీల అభ్యర్థులు.. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఖర్చు ఎంతైనా వెనకడుగు వేయడం లేదు. ఈ నేపథ్యంలోనే కొందరు నాయకులు ఇంజినీరింగ్‌ విద్యార్థులతో ప్రచారం చేయించుకుంటున్నారు. ఇందుకోసం వారికి ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తున్నారు.

Telangana Assembly poll 2023
Telangana Assembly Elections 2023

By ETV Bharat Telangana Team

Published : Nov 15, 2023, 1:00 PM IST

MLA Candidates Using Engineering Students for Election Campaign : తెలంగాణలో ఎన్నికలవేడి రాజుకుంది. ఇప్పటికే పార్టీలు కదనరంగంలోకి దూకాయి.ఓవైపు పోటీచేస్తున్న అభ్యర్థులు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తూ.. గెలుపు వ్యూహాలకు పదును పెడుతున్నారు. మరోవైపు రోడ్‌ షోలు, ఇంటింటి ప్రచారాలతో (Telangana Election Campaign).. ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రజలను ఆకట్టుకునే పనిలో పడ్డారు. కార్యకర్తల నుంచి పార్టీ అధినేతల వరకు ఆచితూచి అడుగులేస్తున్నారు.

Political Parties Election Campaign :ఈ క్రమంలోనే గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలకు చెందిన కొందరు నేతలు (Telangana MLA Candidates).. హైదరాబాద్‌ శివారులోని కొన్ని ప్రైవేట్ ఇంజినీరింగ్‌ కాలేజీల విద్యార్థులతో ప్రచారం చేయిస్తున్నారు. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, ఎల్బీనగర్‌, మహేశ్వరం, మల్కాజిగిరి, మేడ్చల్‌, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గాల ప్రధాన పార్టీల అభ్యర్థులకు మద్దతుగా ఇంజినీరింగ్‌ విద్యార్థులు ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీల పాటలు

Telangana Assembly Elections 2023 : ఆయా నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన ప్రాంతాలకు వీరిని పంపుతున్నారు. 10 నుంచి 20 మంది విద్యార్థులున్న బృందాలకు ప్రత్యేక ప్యాకేజీలను ఇస్తున్నారు. రోజుకు రూ.10,000 నుంచి రూ.20,000ల వరకు చెల్లిస్తున్నారు. సోషల్ మీడియాల ద్వారా కూడా ప్రచారం చేయిస్తున్నారు. అలా యువతీ యువకులు, ఇంజినీరింగ్‌ చదువుకుంటున్న విద్యార్థులు ఓట్లు వేస్తారన్న భావనతో వారు ఉన్నారు.

ఓటమితో మొదలెట్టి - ఆపై గెలుపు బండెక్కి, ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకోని నేతలెవరో తెలుసా?

వినూత్న తరహాలో :ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున ప్రచారానికి వెళ్తున్న విద్యార్థుల బృందాలు.. ఎక్కువగా అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలు, మధ్య తరగతి వాసులు, విద్యాసంస్థల పరిసర ప్రాంతాలను ఎంపిక చేసుకుంటున్నాయి. ఆయా ప్రాంతాల్లో వారి మిత్రులు, అదే కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థుల ఇండ్లు, అపార్ట్‌మెంట్లకు వెళ్తున్నారు. భారీస్థాయిలో ప్లకార్డులు, జెండాలు అభ్యర్థి పార్టీల కరపత్రాలు తీసుకెళ్లకుండా కొన్నింటిని మాత్రమే అక్కడికి తీసుకువెళ్తున్నారు. తమ అభ్యర్థికే కచ్చితంగా మద్దతు ఇచ్చి ఓట్లు వేయాలంటూ వారిని అభ్యర్థిస్తున్నారు.

  • మరోవైపు ప్రచారం కోసం వెళ్లిన ప్రాంతాల్లో అక్కడి సమస్యలను విద్యార్థుల బృందాలు ప్రస్తావిస్తున్నారు. తాము ప్రచారం చేస్తున్న అభ్యర్థికి ఓటేస్తే రెండు, మూడు నెలల్లో పరిష్కారమవుతాయని చెబుతున్నారు.
  • విద్యుత్‌, రోడ్లు, ప్రజారవాణా అంశాలను ప్రస్తావిస్తున్నారు. మరింత మెరుగైన విధంగా సౌకర్యాలు కల్పించేలా ఎమ్మెల్యే అభ్యర్థికి మీ తరఫున వివరిస్తామని, సాధ్యమైనంత వేగంగా పనులు పూర్తవుతాయని హామీలు ఇస్తున్నారు.
  • అపార్ట్‌మెంట్లకు తాగునీరు సరిగా రాకుంటే.. ఎమ్మెల్యే అభ్యర్థి దృష్టికి తీసుకెళ్లి ఆయన ఖర్చులతోనే పనులు చేయిస్తామంటూ వివరిస్తున్నారు.

ఓటర్లు.. ప్రాంతాలు.. విశ్లేషణ : విద్యార్థులు కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా.. ఓటర్ల మనోగతం, ఏయే ప్రాంతాల్లో ఎక్కువమంది ఓటర్లు ఉన్నారు.. అభ్యర్థులకు ఎంత అనుకూలం.. తదితర అంశాలనూ విశ్లేషించి నివేదికలు తయారు చేసి నాయకులకు ఇస్తున్నారు. మేడ్చల్‌ జిల్లాల్లో రెండు నియోజకవర్గాల ప్రధాన పార్టీ అభ్యర్థులు.. ప్రచారానికి 2,000 మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులను వినియోగించుకుంటున్నారు. ఐదు పోలింగ్‌ కేంద్రాలకు ఒక విద్యార్థుల బృందాన్ని నియమించుకున్నారు. సాయంత్రం నుంచి రాత్రి వరకూ ఆ బృందం ఓటర్ల వద్దకు వెళ్తున్నారు.

పల్లెబాట పట్టిన పార్టీలు - అధికారం దక్కాలంటే ఆమాత్రం తిప్పలు తప్పవు మరి

అసంతృప్తులపై పార్టీల బుజ్జగింపు మంత్రం, ప్రచారం కీలకదశకు చేరడంతో ఆపద మొక్కులు

ABOUT THE AUTHOR

...view details