ధరణి ఓ అద్భుతమైన అవకాశమని... రైతులంతా వినియోగించుకోవాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాశ్ రెడ్డి కోరారు. రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, గిఫ్ట్‌డీడ్ లాంటివి సులభంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌ను అంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉప్పల్ తహసీల్దార్ కార్యాలయంలో ధరణి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆయన ప్రారంభించారు.
ఎవరైనా, ఎక్కడి నుంచైనా వారి భూములకు సంబంధించిన వివరాలను ధరణి ద్వారా తెలుసుకోవచ్చునని తెలిపారు. మీసేవ కేంద్రాలకు వెళ్లి ప్రాసెసింగ్ ఫీజు కోసం రూ.200 చెల్లించి... వెసులుబాటు ఉన్న రోజు స్లాట్ బుక్ చేసుకోవచ్చని ఆయన సూచించారు. సర్వే నంబర్, ఆధార్ వివరాలు తప్పుగా ఇవ్వకూడదని అన్నారు.