తెలంగాణ

telangana

ETV Bharat / state

Balka Suman Etela: ఆర్​ఆర్​ఆర్​ అంటే ఇప్పుడు అర్థమైంది: బాల్క సుమన్ - ప్రభుత్వ విప్ సుమన్

తెరాసను ఎదుర్కొనే సత్తా లేకనే రెండు జాతీయ పార్టీలు ఏకమయ్యాయని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ఆరోపించారు. హుజూరాబాద్‌ ఉపఎన్నికలో తెరాసను ఓడించేందుకు కలిసి పని చేశాయని మండిపడ్డారు. ఈ ఎన్నికలో నైతిక విజయం తెరాసదేనన్నారు.

MLA Balka suman
బాల్క సుమన్

By

Published : Nov 3, 2021, 9:03 PM IST

హుజూరాబాద్​ ఉపఎన్నికలో భాజపా, కాంగ్రెస్‌ కలిసి పని చేశాయనే దానికి కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లే నిదర్శనమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పష్టం చేశారు. తెరాసను ఓడించేందుకు రెండు జాతీయ పార్టీలు కలిసి పని చేశాయని ఆరోపించారు. కమలం కింద పడిపోకుండా చేయి అందించి మరీ గెలిపించారని విమర్శించారు. దిల్లీలో శత్రువులుగా ఉంటూ రాష్ట్రంలో మిత్రులుగా పనిచేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. తెరాస ఒక్క ఓటమితో కుంగిపోదని అన్నారు.

ఆర్ఆర్ఆర్ అంటే రాజాసింగ్, రఘునందన్ రావు, రేవంత్ రెడ్డి అని బాల్క సుమన్​ ఎద్దేవా చేశారు. ఈటల రాజేందర్ ఇకనైనా తెరాస నేతలపై విరుచుకపడటం ఆపి... హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి ఎన్ని నిధులు ఎలా తీసుకొస్తారో ప్రజలకు ఈటల రాజేందర్, భాజపా నేతలు వివరించాలన్నారు. హుజూరాబాద్ ఎన్నికలో భాజపా, కాంగ్రెస్ కుమ్మక్కై.. భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీగా అవతరించాయని ఆరోపించారు.

Balka Suman Etela

ఇదీ చూడండి:

Bandi Sanjay: రేపటి నుంచే రాష్ట్రమంతా దళితబంధు అమలు చేయాలి.. లేదంటే...

ABOUT THE AUTHOR

...view details