ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను ఏసీబీ ప్రత్యేక కోర్టు వచ్చే నెల 7కు వాయిదా వేసింది. నిందితులకు బెయిల్ మంజూరు చేయాలని.. ఇప్పటికే పూర్తి వివరాలు సేకరించారని దర్యాప్తునకు సహకరిస్తారని నిందితుల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నిందితుల అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి బెయిల్ ఇవ్వాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. సింహయాజి స్వామిజీ, రామచంద్ర భారతి అనారోగ్యంతో బాధపడుతున్నారని వాళ్ల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కోర్టు.. పిటిషన్ను వచ్చే నెల 7కు వాయిదా వేసింది.
ఎమ్మెల్యేల ఎర కేసు నిందితుల బెయిల్ పిటిషన్.. నవంబర్ 7కు వాయిదా వేసిన కోర్టు - MLA baiting case
ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితులకు బెయిల్ మంజూరు చేయాలని నిందితుల తరఫు న్యాయవాది కోర్టును కోరారు. నిందితుల అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
ఎమ్మెల్యేల ఎర కేసును నవంబర్ 7వ తేదీకి వాయిదా..వేసిన కోర్టు
Last Updated : Oct 31, 2022, 11:01 PM IST