హైదరాబాద్ కూకట్పల్లి భాగ్యనగర్ కాలనీలోని ఏఎస్‌రావునగర్‌లో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి బయలుదేరారు. అల్విన్ కాలనీ ఉషాముళ్లపూడి కమాన్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ప్రారంభోత్సవానికి తొందరగా చేరుకోవాలని పోలీస్ సైరన్ మోగిస్తూ ఎమ్మెల్యే కాన్వాయ్ రాంగ్రూట్లో దూసుకెళ్లింది.
WRONG ROUTE: పోలీస్ సైరన్‌తో రాంగ్రూట్లో ఎమ్మెల్యే కాన్వాయ్
సాధారణ ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీగా జరిమానాలు వేస్తూ.. ముక్కుపిండి వసూలు చేసే ట్రాఫిక్ పోలీసులు.. అదే ఓ ఎమ్మెల్యే కాన్వాయ్ రాంగ్రూట్లో వెళ్తుంటే మాత్రం చూస్తూ మిన్నకుండిపోయారు. పోలీస్ సైరన్ మోగిస్తూ కాన్వాయ్ దర్జాగా రాంగ్రూట్లో దూసుకెళ్తుంటే.. ఆపడం కాదు కదా.. కనీసం చలాన్ కూడా విధించలేకపోయారు. ఇది చూసిన వాహనదారులు పోలీసుల తీరుపై మండిపడుతున్నారు.
పోలీస్ సైరన్ మోగిస్తూ రాంగ్రూట్లో దూసుకెళ్లిన ఎమ్మెల్యే కాన్వాయ్
అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులే ఇలా ట్రాఫిక్ నిబంధనలు తుంగలో తొక్కడం ఏంటనిా వాహనదారులు మండిపడ్డారు. సాధారణ పౌరులకు చలాన్లు విధించే పోలీసులే సైరన్ వేస్తూ ఎమ్మెల్యే కాన్వాయ్‌ను రాంగ్రూట్లో తీసుకెళ్లడం ఏంటని ప్రశ్నించారు. సాధారణ ప్రజలకు వర్తించే ట్రాఫిక్ నియమాలు అధికారులు, ప్రజాప్రతినిధులకు వర్తించవా అంటూ నిట్టూర్చారు.
ఇదీ చూడండి: SCHOOLS OPEN: జులై 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభించాలని నిర్ణయం
TAGGED:
తెలంగాణ తాజా వార్తలు