తెలంగాణ

telangana

ETV Bharat / state

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గాంధీ - ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ

మంత్రి కేటీఆర్ సూచనల మేరకు హైదరాబాద్ కూకట్​పల్లిలోని వివేకానంద నగర్ డివిజన్​లో తెరాస నాయకులు రంగారావు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 150 మంది తెరాస కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.

MLA GANDHI STARTED BLOOD DONATION CAMP
రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గాంధీ

By

Published : May 4, 2020, 7:37 PM IST

కరోనా కారణంగా దేశంలో రక్త నిల్వలు తగ్గిపోతున్నందున యువత రక్త దానం చేయాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. కూకట్ పల్లి వివేకానంద నగర్​లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ... రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

కేవలం ప్రారంభించడమే కాకుండా రక్తదానం చేసి నాయకులు, కార్యకర్తలు కూడా రక్త దానం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది తెరాస నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు.

ఇవీ చూడండి:హైదరాబాద్​లో ఒక్క రోజులోనే 20 కేసులు

ABOUT THE AUTHOR

...view details