హైకోర్టు భవనాన్ని ఎక్కడకీ తరలించకూడదనిఎంఐఎం శాసనసభపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. అంతగా కావాలనుకుంటే సిటీ కళాశాల భవనానికి హైకోర్టును తరలించాలని సూచించారు. నల్లమల అడవిలో యురేనియం తవ్వకాలను తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. యురేనియం తవ్వకాలను జరిపితే... 15 మండలాలకు చెందిన 70 వేల మంది ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వివరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తవ్వకాలను నిలిపివేయాలని, అక్కడున్న ఆదివాసీలను, వన్యప్రాణులను సంరక్షించాలని కోరారు.
'యురేనియం తవ్వకాలను ఖండిస్తున్నాను' - NALLAMALA
నల్లమలలో యురేనియం తవ్వకాలు సరికాదన్నారు ఎంఐఎం శాసనసభపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ. పచ్చని చెట్లు, వన్యప్రాణులు, గిరిజనుల జీవితాలను బలిపెట్టవద్దని అసెంబ్లీలో ప్రభుత్వానికి సూచించారు.
'యురేనియం తవ్వకాలను ఖండిస్తున్నాను'
Last Updated : Sep 14, 2019, 9:40 PM IST